ఏంటి .. కీర్తి సురేష్ కన్ను దానిపై పడిందా ?

Monday, October 22nd, 2018, 09:48:00 PM IST

లేటెస్ట్ గా సౌత్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎవరికీ దక్కని క్రేజ్ మహానటి తో కీర్తి సురేష్ కొట్టేసింది. మహానటి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ మలయాళ కుట్టి .. ఇకపై ఏ బయోపిక్ లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఇక లేటెస్ట్ గా పందెం కోడి 2 లో చిచ్చరపిడుగుగా .. ఓ రేంజ్ నటన కనబరిచింది. అయితే ఈ అమ్మడికి నటిగానే కాదు ఇప్పుడు మరో ప్రొపెషన్ పై కన్ను పడింది .. ఆ ప్రొపెషన్ ఏమిటో తెలుసా .. దర్శకత్వం !! ఏంటి షాక్ అయ్యారా ? నిజమే కీర్తి సురేష్ కి నటన కాకుండా దర్శకత్వం అంటే కూడా చాలా ఇష్టమట.

అందుకే సెట్స్ లో ఉన్నప్పుడు దర్శకుడిని బాగా గమనిస్తూ ఏ సీన్ ఎలా తీస్తున్నాడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుందట .. అంతే కాదండోయ్ .. ఈమెకు స్క్రిప్ట్ కూడా రాసె అలవాటు ఉందట .. కాళీ సమయాల్లో స్క్రిప్ట్ కూడా రాసుకుంటా అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఈ లెక్కన మహానటి సినిమా చేసినప్పుడు సావిత్రి పూనినట్లుంది. అందుకే అటు దర్శకత్వం పై ఆసక్తి పెరిగింది. సో ఈ అమ్మడి మాటలు వింటుంటే దర్శకురాలిగా మారె సమయం దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments