విడుదల కు ముందే కేజీఎఫ్2 భారీ రికార్డ్!

Tuesday, May 19th, 2020, 08:44:08 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి, ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ చిత్రానికి సౌత్ లో మాత్రమే కాకుండా, భారత్ అంతటా క్రేజ్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు ఉంది. కేజీ ఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.అయితే ఇంకా కేవలం ఒక్క 20 రోజులు షూటింగ్ మాత్రమే పెందిగ్ లో ఉన్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది.

అయితే కేజి ఎఫ్ చాప్టర్ 2 విడుదల కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. రౌద్రం రణం రుధిరం చిత్రం తర్వాత అంతా భారీగా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోవడం ఈ చిత్రానికే చెల్లింది. డిజిటల్ మరియు దియెట్రికల్ రైట్స్ 175 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు నుండి రావు రమేష కీలక పాత్ర లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.