కే.జి.ఎఫ్ ట్రైలర్ టాక్ : ఆసక్తి రేపుతున్న పీరియాడిక్ డ్రామా..!

Friday, November 9th, 2018, 06:16:48 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, ఏ ఏ ఫిలిమ్స్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా పెట్టుబడులు సమకూర్చగా విజయ్ కిరంగదూర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం కేజీఎఫ్. కన్నడ యువ హీరో యష్ ఇందులో కథానాయకుడు. వారాహి చలనచిత్రం పతాకం పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు లో అందిస్తూఅన్నారు, డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అత్యంత ప్రెతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది.

ఇవాళ విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 ట్రైలర్ విశేషాల్లోకి వెళితే, తెలుగు ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది, హీరో అప్పీరెన్స్, మనసు పై బలమైన ముద్ర వేసేలా ఉన్న బీజీఎమ్ ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి, 1970ల నాటి కాలంలో కర్ణాటక తోమి కొల్లార్ బంగారు గనుల్లో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ట్రైలర్ లో కొంత భాగం ముంబైలో కూడా కథ నడిచినట్టు కనిపిస్తుంది, ఈ కథకి ముంబై సంబంధం ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది. మొదటి నుండి చెప్తున్నట్టుగానే ఇది రొటీన్ సినిమా కాదు అంతకు మించి అని ట్రైలర్ చుస్తే అర్తం అవుతుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ, రి-రికార్డింగ్ , 70ల నటి కాలాన్ని తలపించే ఆర్ట్ వర్క్ సినిమా పై అంచనాలు పెంచే విదంగా ఉన్నాయ్. రగ్గుడ్ లుక్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్తూ ట్రైలర్ ఆద్యంతం యష్ ఆకట్టుకున్నాడు. శ్రీనిధి దత్త తదితరులు ఈ చిత్రంలో నటిస్తుండగా రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments