బుక్ మై షోలో ”కేజీయఫ్ చాప్టర్ 2″ క్రేజ్ మాములుగా లేదు!

Monday, March 23rd, 2020, 09:20:05 PM IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ను సంతరించుకున్న చిత్రాల్లో కేజీయఫ్ చాప్టర్ కూడా ఒకటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ చిత్రం పై ఇప్పుడు ఎనలేని అంచనాలు ఏర్పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి పార్ట్ దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందో చూసాం.ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు.

జస్ట్ ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇప్పుడు మరో ఉదాహరణ బయటకొచ్చింది.ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక సినిమా విడుదలకు ముందే బుక్ మై షో యాప్ లో లక్షా 50 వేల లైక్స్ మార్క్ ను టచ్ చెయ్యడం జరగలేదని కానీ ఆ ఫీట్ ను కేజీయఫ్ చాప్టర్ 2 కొట్టిందని తెలుస్తుంది.దీనిని బట్టి ఈ సినిమా కోసం యావత్తు మన దేశ ప్రజలు ఎంతలా ఎదురు చూస్తున్నరో మనం అర్ధం చేసుకోవచ్చు.