ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్న కేజీఎఫ్ దర్శకుడు!

Monday, July 27th, 2020, 08:27:04 PM IST

సౌత్ ఇండియా నుండి పాన్ ఇండియన్ మూవీ గా మారిన చిత్రం కేజీ ఎఫ్. ఈ చిత్రం విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపు చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, కేజీ ఎఫ్ చాప్టర్ 2 కి సంబందించిన అప్డేట్ ను అతి త్వరలో విడుదల చేయనున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఆ అప్డేట్ ఈ నెల 29 న విడుదల చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. అయితే అన్ వీలింగ్ బృటాలిటీ అంటూ ఇందుకు కాప్షన్ కూడా తగిలించారు.

అయితే ఈ చిత్రం నుండి రాఖీ భాయ్ లుక్ ఇప్పటికే విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో భయంకర విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఒక గరుడ పాత్రను ఎంతో పవర్ ఫుల్ గా తెరకెక్కించిన ప్రశాంత్, సంజయ్ పాత్ర పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్టుగానే లుక్ లేదా టీజర్ ఉండే అవకాశం ఉందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఆ సర్ప్రైజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.