ఖ‌డ్గం హీరోయిన్ కుర్ర‌హీరోతో ఎఫైర్‌

Friday, October 26th, 2018, 10:40:10 PM IST

ఖ‌డ్గం ఫేం కిమ్ శ‌ర్మ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? ఈ ప్ర‌శ్న‌కు ఇదిగో ఇదే స‌మాధానం. కిమ్ శ‌ర్మ ప్ర‌స్తుతం ఓ కుర్ర‌హీరోతో డేటింగులో ఉంది. ఇది ఇప్పుడే కాదు కానీ, చాలా కాలంగానే ఆ ఇద్ద‌రిపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతూనే ఉంది. ఇంత‌కీ ఎవ‌రా కుర్ర‌హీరో అంటే.. టాలీవుడ్ యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తోంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోలు ప్ర‌స్తుతం వెబ్‌లో విరివిగా ఫోటోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

కిమ్ శ‌ర్మ బోయ్‌ఫ్రెండ్స్ లిస్టు చిన్న‌దేం కాదు. ఇదివ‌ర‌కూ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌తో ఎఫైర్ సాగించింది. అటుపై అప్ప‌టికే పెళ్ల‌యిన డిజైన‌ర్ అర్జున్ ఖ‌న్నాతోనూ ఘాటైన ఎఫైర్ సాగించింది. ఆ త‌ర్వాత బిజినెస్‌మేన్ అలీని పెళ్లాడింది. అటుపై అత‌డికి విడాకులిచ్చి, ప్ర‌స్తుతం కుర్ర‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఆ ఇద్ద‌రూ చేతిలో చెయ్యేసి చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తున్న ఫోటోలు, ఒకే స్కూట‌ర్‌పై రైడ్‌కి వెళుతున్న ఫోటోలు వెబ్లో హ‌ల్‌చ‌ట్ చేస్తున్నాయి. కిమ్ పాల్తాన్ చిత్రంలో న‌టించింది. ఇటీవ‌లే ఈ చిత్రం రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే న‌టించాడు. అప్ప‌టినుంచి ప‌రిచ‌యం కాస్తా అలా పెరిగి పెద్ద‌దైంద‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments