ఘాటు ముద్దులకు సిద్ధమంటున్న మహేష్ హీరోయిన్ ?

Tuesday, September 25th, 2018, 09:22:16 PM IST

లేటెస్ట్ గా మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ ఖైదా అడ్వాణీకి ఇప్పడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తరువాత వెంటనే రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో ఛాన్స్ పెట్టేసింది. మరో వైపు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో క్రేజీ అవకాశం వచ్చింది. అది మాములు అవకాశం కాదు .. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సంచలనం రేపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో హీరో విక్రమ్ తనయుడు నటిస్తుండగా వర్మ పేరుతొ రీమేక్ అవుతుంది .. ఇక హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఖైదా అద్వానీ ని ఎంపిక చేశారట. ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించి చివరగా ఖైరా ను ఎంపిక చేసారు. ఈ పాత్ర చేయడానికి ఖైరా కూడా ఓకే చెప్పడంతో .. ఈ అమ్మడు ఘాటు రేపేందుకు రెడీ అయిందంటూ బి టౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య ఘాటు లిప్ లాక్ సీన్స్ చాలానే ఉన్నాయి. పైగా రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువే . మొత్తానికి ఖైరా ఘాటు లిప్ లాక్ లకు, గ్లామర్ సీన్స్ కు రెడీ అని సంచలనం రేపింది. నిజమే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇలాంటి సంచలన పాత్రలు చేస్తే తప్ప క్రే తెచ్చుకోలేమని ఈ అమ్మడు భావించిందో ఏమో.