హాట్ టాపిక్: పవన్ కి నో చెప్పి, మహేష్ కి ఓకే చెప్పిన కైరా అద్వానీ!

Tuesday, February 11th, 2020, 02:21:17 PM IST

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రం తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే చాల గ్యాప్ తీసుకొని పవన్ నటిస్తుండటంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంతేకాకుండా పవన్ తన తదుపరి చిత్రం క్రిష్ తో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కైరా అద్వానీని సంప్రదించగా నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే పవన్ చిత్రానికి మాత్రమే కాకుండా, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ చిత్రాలకు కిరా అద్వానీ నో చెప్పినట్లు సమాచారం.

మహేష్-వంశీ పైడిపల్లి నుండి వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా కీరా ని సంప్రదించగా ఓకే చెప్పింది. అయితే పవన్ కి నో చెప్పి, మహేష్ కి ఓకే చెప్పడం పట్ల కొందరు చర్చలు జరుపుతున్నారు. అయితే గతంలో మహేష్ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీరా అద్వానీ మరోసారి మహేష్ తో నటించే అవకాశం దక్కించుకుంది. సౌత్ లో ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తా అని తెలిపిన కీరా ఆ సినిమా మహేష్ ది కావడం మరో విశేషం.