బాహుబలికి , సై రా కి తేడా ఆ ఒక్కటే–నటుడు సుదీప్

Thursday, December 12th, 2019, 10:47:16 AM IST

తెలుగునాట పాన్ ఇండియా చిత్రాల హవా బాహుబలితో నే ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. అయితే బాహుబలి మాత్రం అలా జరగలేదు, ప్రపంచమంతా ఏలింది, దానికితోడు కలెక్షన్లలో కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ రెండు చిత్రాలకు వున్న తేడా నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు.

అయితే సైరా సినిమాకి ఒక కల్చరల్ సమస్య ఉందని కిచ్చా సుదీప్ అన్నారు. ఇది సౌతిండియా కి చెందినటువంటి బయోపిక్ అని అన్నారు. బయోపిక్ ని కల్పించి తీయలేం కాబట్టి వాస్తవాల్ని చూపించాల్సి ఉంటుంది. కానీ బాహుబలి అలా కాదు. కల్పిత కథ. అయితే ఇందులో ఏదైనా విషయాన్నీ మనకు నచ్చినట్లుగా చూపించవచ్చు. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచమంతా ఆదరించడానికి గల కారణం రాజమౌళి అని అన్నారు. ఈగ చిత్రంలో జరిగిన కొన్ని పొరబాట్లని చాల త్వరితంగా అర్ధం చేసుకొని బాహుబలికి అలా కాకుండా చేసారు. త్వరగా దేన్నైనా గ్రహించగలరు రాజమౌళి అని అన్నారు. అయితే ఇక ఫై పాన్ ఇండియా సినిమాల్లో నటించాలంటే బయోపిక్ లో నటించకుండా కల్పిత కథ ఉన్నటువంటి చిత్రాలలోని నటిస్తానని తెలిపారు.