బాలీవుడ్‌లో రియ‌ల్ లైఫ్ సిత్రాలు.. ఇలాగే ఉంటాయా..?

Saturday, October 27th, 2018, 03:11:35 PM IST

బాలీవుడ్ హాట్ భామ కిమ్ శ‌ర్మ గుర్తుందా.. అదేనండి ఖ‌డ్గం చిత్రంలో ముసుగువెయ్యెద్దు మ‌న‌సుమీద అంటూ త‌న అందాల‌తో పిచ్చెక్కింది.. గుర్తొచ్చిందా కిమ్‌శ‌ర్మ‌.. ఈ ముద్దుగుమ్మ‌కు సంబంధించిన ఒక మ్యాట‌ర్ బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ ముదురు భామ న‌టించింది కొన్ని చిత్రాల్లోనే అయినా హాట్ గార్ల్‌గా కుర్ర‌కారు గుండెల్లో అల‌జ‌డులు సృష్టించింది. అయితే ఆమె ఎంత‌గా ఆందాలు ఆర‌బోసినా ఆ చిత్రాలు స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో త‌ట్టా బుట్టా స‌ర్దుకొని పెళ్ళి చేసుకుంది.

అయితే పెళ్ళికి ముందు ప్రేమాయ‌ణాలు చాలానే న‌డిపిన కిమ్ శ‌ర్మ మొద‌ట క్రికెట‌ర్ యువ‌రాజ్‌తో చాలా రోజులు డేటింగ్ చేసింది. ఇక యువ‌రాజ్‌తో రిలేష‌న్ బ్రేక్ అయ్యాక‌.. అర్జున్ ఖ‌న్నాతో సర‌సాలు సాగించింది. అత‌నితో కూడా తేడా కొట్ట‌డంతో అలి అనే వ్య‌క్తిని పెళ్ళి చేసుకోవ‌డం.. కొన్నేళ్ళు సంసారం చేసిన త‌ర్వాత అత‌డ్ని కూడా వ‌దిలేసింది. అయితే తాజాగా సినీ న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టింది. తాజాగా ఈ ఇద్ద‌రు క‌లిసి చేసిన బైక్ రైడింగ్ పొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు బాలీవుడ్ రియ‌ల్ లైఫ్ సిత్రాలు ఇలాగే ఉంటాయ‌ని కామెంట్లు పెడుతుండా.. బాలీవుడ్‌లో మాత్రం ఈ ఇద్ద‌రి రిలేష‌న్ పై పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది.