బిగ్ అప్డేట్ : మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా…? క్లారిటీ ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్

Thursday, October 17th, 2019, 10:27:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి సైరా విజయానందంలో మునిగిపోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, చారిత్రిక నేపథ్యం గల కథ తో తెరకెక్కిన సైరా చిత్రంను ప్రముఖులందరికి చూపించే పనిలో ఉన్నారు చిరంజీవి. కాగా వెనువెంటనే తన 152 వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు మెగాస్టార్. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. కాగా వచ్చే నెల నుండి ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ రెగ్యులర్ గా జరుగుతుందని సమాచారం.

కాగా ఈ సినిమా విషయంలో ఒక లేటెస్ట్ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ప్రచారంలో ఉన్నటువంటి వార్త ఏంటంటే… చిరు, కొరటాల శివ ల కలయికలో రానున్నటువంటి కొత్త చిత్రానికి సంబంధించి ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్‌ పెట్టారని, అందుకు సంబంధించి ఒక చిరంజీవి న్యూ పోస్టర్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ టైటిల్‌ను కన్ఫార్మ్ చేయలేదంటూ ఆ సంస్ధ ఓ ట్వీట్ చేసింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని, ప్రతీది తాము అధికారికంగా వెల్లడిస్తామని వెల్లడించారు.