కొణిదెల ఉపాసన ధైర్యాన్ని మెచ్చుకుంటున్న “సౌత్ ఇండియా”

Sunday, October 20th, 2019, 01:55:56 PM IST

సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో నరేంద్ర మోడీ చర్చ జరిపారు. అయితే ఈ కార్యక్రమం లో బాలీవుడ్ స్టార్లు, స్టార్ హీరోయిన్లు వున్నారు. అయితే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, నరేంద్ర మోడీ ల ఫోటోని జత కలిపి ఒక పోస్ట్ చేసింది ఉపాసన. దక్షిణాది తారలను కూడా గుర్తించండి అని పేర్కొన్నారు. మీరంటే మాకు ఎంతో గౌరవం, అభిమానం అని తెలిపింది. మీరు ఈ దేశానికి ప్రధాని అయినందుకు మేము అందరం చాల గర్వ పడుతున్నాం. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మాత్రమే వున్నారు. దక్షిణాది నటుల పై నిర్లక్ష్యం చూపించారని పేర్కొన్నారు. నేను ఎంతో బాధతో ఈ విషయాన్నీ తెలియజేస్తున్న, దక్షిణాది నటుల్ని కూడా గౌరవించాలని కోరుకుంటున్నా దీనిని మీరు సరిగ్గా అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన పెట్టిన ఈ పోస్టుకు నెటిజెన్ల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. ఎంతోమంది తన పోస్ట్ కు అనుకూల భావం వ్యక్తం చేసారు. కొందరు ఉపాసన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అందరి భావాన్ని తెలియజేసావు అంటూ మరొకరు పెట్టారు. ఏదేమైనా ఇంతమంది వున్నా సౌత్ ఇండియా సినీ ప్రపంచం లో ఉపాసన స్పందించడం పట్ల అభిమానులు మెచ్చుకుంటున్నారు.