వాళ్లకు భరత్ కు పోలిక లేదంటున్న కొరటాల శివ ?

Thursday, April 19th, 2018, 10:42:53 PM IST

క్రేజీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా రేపు విడుదలకు సిద్ధం అయింది. మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించే ఈ సినిమా పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయంగా నిలిచిన ఒకే ఒక్కడు, లీడర్ సినిమాల ఛాయలో ఉంటుందంటూ తెగ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. తాజగా ఓ ఇంటర్వ్యూ లో కొరటాల శివ స్పందించాడు. భరత్ అనె నేను సినిమా ఆయా సినిమాలకు దగ్గరగా ఉండదని .. అసలు ఈ కథ మొత్తం వేరేలా ఉంటుందని చెప్పేసాడు. ఈ ఇనెమ ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ ని కలిగిస్తుందని చెబుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా భారీ హైప్ తెచ్చుకుంది. మహేష్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏకంగా 2000 కు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments