అయ్యా కొర‌టాల శ్రీ‌రెడ్డికి వివేకానందుడికి లింకేంటి?

Tuesday, April 17th, 2018, 10:30:06 PM IST

కొన్నాళ్లుగా శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ బూతు పంచ‌నామాలో ఇండ‌స్ట్రీ టాప్ సెల‌బ్రిటీల పేర్లు లీక‌య్యాయి. ఒక స్టార్ డైరెక్ట‌ర్ అంటూ వాట్సాప్ చాట్‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది శ్రీ‌రెడ్డి. ఆ త‌ర‌వాత కొర‌టాల‌తో చాటింగ్ అంటూ ఒక‌టే మీడియాలో హోరెత్తిపోయింది. అయితే ఈ వివాదంపై కొరటాల ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్నారు. ఓవైపు భ‌ర‌త్ అనే నేను రిలీజ్ టెన్ష‌న్‌లో ఉన్న ఆయ‌న‌కు ఇప్ప‌టికి కాస్తంత తీరిక చిక్కింది. ఈ వివాదంపై కొర‌టాల త‌న‌దైన స్టైల్లో స‌మాధాన‌మిచ్చారు. త‌న‌పై ప‌డిన మ‌ర‌క‌ను తుడుచుకునే ప్ర‌య‌త్నం చేశారు.

కొర‌టాల సుదీర్ఘంగా మాట్లాడుతూ -“సోష‌ల్ మీడియాలో నాపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. అయితే వాట‌న్నిటికి నేను ఆన్స‌ర్ ఇవ్వాల‌నుకున్నా.. ఏవో చిన్న గాసిప్పులేన‌ని అంతా అన‌డంతో ప‌ట్టించుకోలేదు. ప‌దే ప‌దే ఇవే రిపీట‌వ్వ‌డంతో వివ‌ర‌ణ ఇవ్వాల‌నిపించింది. భ‌ర‌త్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీ అయ్యే ముందే ఓ వివ‌ర‌ణ అవ‌స‌రం అనిపించింది. వాస్త‌వానికి నేను ప‌ర్స‌న‌ల్‌గా కాస్టింగ్ కౌచ్‌ని అంగీక‌రించ‌ను. అలాంటి వాటికి పూర్తిగా వ్య‌తిరేకం. నా చుట్టూ ఉన్న వారిని ఇలాంటివాటికి ప్రోత్స‌హించ‌ను. ఎంద‌రో ఆర్టిస్టుల‌తో ప‌ని చేస్తుంటాం. చిన్న‌వారిని అయినా కానీ ఎంతో గౌర‌విస్తాం ఇక్క‌డ‌. ఆన్‌ లొకేష‌న్‌లో ప‌ని చేసేప్పుడు అంద‌రితో ఎంతో గౌర‌వంగా ఉంటాం. అండీ అనే పిలుస్తాను నేనైతే. సందేశాలిచ్చే సినిమాలు తీసేప్పుడు ప్ర‌తి చిన్న పిన్ పాయింట్‌పై ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. చిన్న‌ప్పుడే నాన్న‌ చ‌నిపోయాక అమ్మ ఆల‌నాపాల‌న‌లో పెరిగాను. ఆ త‌ర‌వాత పెళ్ల‌య్యాక అమ్మ చ‌నిపోయారు. ఆ త‌ర‌వాత అంతా నా వైఫ్‌తోనే ప్ర‌తిదీ షేర్ చేసుకుంటాను. త‌ను నాకు ఎంతో స‌పోర్ట్‌నిచ్చింది. నా స‌హ‌చ‌రులు ఈ గాసిప్‌లు విని నాకు అండ‌గా నిలిచారు. అస‌లు న‌న్నెవ‌రూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ అడ‌గ‌లేదు. ఆడ‌వారిని గౌర‌వించ‌డం అన్నది తొలినుంచి అల‌వాటు నాకు. అలాంటి నాపై ఈ నింద వేయ‌డంతోనే ఇలా మీ ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇస్తున్నా“ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు అమెరికా వెళ్లిన‌ప్పుడు వివేకానందుడిపైనే నింద వేశారు. నేనెంత‌టి వాడిని! అని చివ‌రిలో కొరటాల ఇచ్చిన స్వీట్ ట్విస్టుకు దిమ్మ‌తిరిగిపోవాల్సిందే!!!!!!