మాస్క్ లేకుండా తిరిగితే మనకి, పశువులకు తేడా ఉండదు – కొరటాల శివ

Tuesday, July 21st, 2020, 07:39:06 PM IST


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలను మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కరోనా వైరస్ మహమ్మారి పై అవగాహన లేకుండా కొందరు ఇప్పటికీ కూడా మాస్క్ లు లేకుండా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయం పై దర్శకుడు కొరటాల శివ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంత చెప్తున్నా మాస్క్ లు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి పశువులకు తేడా ఉండదు అని కొరటాల శివ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ వ్యాది వ్యాప్తి తగ్గాలి అంటే అదొక్కటే మార్గం అని అన్నారు. దయచేసి మాస్క్ ను వేసుకుందాం, వేసుకొని వాళ్ళకి పనిమాల చెబుదాం అని అన్నారు. అయితే సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలను తీసే కొరటాల శివ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం మరణిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణం చేత కొరటాల శివ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం సైతం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిరు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.