పడిపోయిన గ్రాఫ్ – నిరాశలో కౌశల్..!

Saturday, November 10th, 2018, 12:44:54 PM IST

కౌశల్, బిగ్ బాస్2 రియాలిటీ షో సమయంలో సంచలనమై తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు. ఆ షో ముగిసిన తర్వాత తనకు ఏర్పడిన క్రేజ్ ను ఉపయోగించి కౌశల్ సంచలనాలు సృష్టిస్తాడు అనుకున్నారంతా, కౌశల్ ఆర్మీ పేరిట ఒక సైన్యం ఏర్పడటం తో ఆ క్రేజ్ ను తెలంగాణ ఎన్నికల్లో వాడుకోబోతున్నారు అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి ఆ మధ్య. అందరు అనుకున్నది వేరు, వాస్తవానికి జరుగుతున్నది వేరు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక సన్మానాలు, సత్కారాలు అయితే జరుగుతున్నాయి కానీ, అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చిన్న చితక వ్యాపార సంస్థలు తమ ప్రకటనలకు కౌశల్ ను బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతే కాకుండా షో జరుగుతున్న సమయంలో కౌశల్ ను ప్రసంశించిన పలువురు దర్శకులు వారు తీయబోయే సినిమాల్లో అవకాశాలు కూడా ఇస్తాం అన్నారు. ఈ నేపథ్యంలో బుల్లి తెర స్టార్ హవా తగ్గిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని పై విశ్లేషకుల అభిప్రాయం వేరేలా ఉంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఎవరూ ఆ షో ముగిసాక పెద్దగా వార్తల్లో ఉండరు, కౌశల్ విషయంలో కూడా అదే నిజమైంది అని వారు అభిప్రాయం పడుతున్నారు. గత షోలలో వచ్చిన పార్టీసిపేంట్స్ కంటే కౌశల్ తో ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు తీసుకునే వారు ఎక్కువ ఉండటం మినహాయించి, కౌశల్ కు కలిసి వచ్చింది ఏమి లేదన్నది వారి అభిప్రాయం, ఏది ఏమైనా ఉవ్వెత్తున ఎగిసిన సముద్ర కెరటంలా ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న కౌశల్ ప్రస్తుతం చల్లబడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments