నా నమ్మకాన్ని నిజం చేయండి : సూపర్ స్టార్

Saturday, April 7th, 2018, 08:38:25 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఎల్బీ స్టేడియంకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆంధ్ర తెలంగాణలోని అభిమానులందరు భరత్ బహిరంగ సభకు రావడంతో వేడుక అభిమానులతో వెలిగిపోయింది. ముందుగా ఈ వేడుకకు హాజరైన సూపర్ స్టార్ కృష్ణ సినిమా గురించి మాట్లాడారు. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో విడుదలైన శ్రీమంతుడు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మళ్లీ అదే కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను సినిమా కూడా మంచి విజయం సాదిస్తుందని అలాగే ‘నా నమ్మకాన్ని మీ ఆశీస్సులతో నిజం చేయండని కృష్ణ తెలిపారు. ఇక భరత్ అనే నేను మేకింగ్ వీడియోను ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments