హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో కృష్ణ వంశీ సినిమా ?

Thursday, April 5th, 2018, 10:33:02 PM IST


క్రియేటివ్ దర్శకుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. అయన సినిమాలు ఇప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అయన సినిమాలంటే అచ్చమైన తెలుగింటి కథలతో కనిపించేవి, సజీవ పాత్రలతో తనదైన మేకింగ్ తో సినిమాలు రూపొందించేవారు. ఈ మద్యే నక్షత్రం సినిమాతో పరాజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఈ సారి ఓ హర్రర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి నక్షత్రం సినిమాకు ముందే ఈ హర్రర్ సినిమాను ప్లాన్ చేసాడట .. కానీ దానికి సమయం పట్టడంతో నక్షత్రం సినిమా తీసేసాడు. ఇక అయన రూపొందించే హర్రర్ థ్రిల్లరా సినిమాకు రుద్రాక్ష అనే టైటిల్ పెడుతున్నాడట. అయితే ఇప్పటికే ఈ సినిమా పట్టాలు ఎక్కాల్సి ఉండగా బడ్జెట్ ఎక్కువ అవడంతో సదరు నిర్మాత వెనక్కి తగ్గాడట. దాంతో మరో నిర్మాత అన్వేషణలో పడ్డ అయన త్వరలోనే ఈ సినిమాను తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.