`కృష్ణార్జున..` రిజ‌ల్ట్‌ హాఫ్ బాయిల్డ్‌!?

Tuesday, April 17th, 2018, 10:24:39 PM IST


టాలీవుడ్‌లో ఎదురేలేనివాడిగా హ‌వా సాగిస్తున్నాడు నాని. డ‌బుల్ హ్యాట్రిక్‌లు, ట్రిపుల్ హ్యాట్రిక్‌లు సాధించిన హీరోగా అత‌డి పేరు ఇండ‌స్ట్రీలో మార్మోగిపోతోంది. `ఆహా క‌ళ్యాణం` డిజాస్ట‌ర్‌తో దిష్ఠి తొల‌గిపోయిన హీరోగా, అర‌డ‌జ‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ల తో టాప్‌స్టాల్‌కి చేరిన నేచుర‌ల్ స్టార్ బిరుదాంకితుడుగా.. త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్న తీరు అన‌న్య‌సామాన్యం. అయితే అజేయంగా సాగుతున్న ఈ జైత్ర‌యాత్ర‌కు అనూహ్య‌మైన ఒక బ్రేక్‌. అదే `కృష్ణార్జున యుద్ధం` అట్ట‌ర్‌ఫ్లాప్ రిజ‌ల్ట్‌. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ తుది ఫ‌లితం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆల్మోస్ట్ ఈ సినిమా వ‌ల్ల పంపిణీదారుల‌కు 50శాతం న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తేలింది.

వారం రోజుల్లో `కృష్ణార్జున యుద్ధం` షేర్‌, గ్రాస్ ఎలా ఉందో ప‌రిశీలిస్తే.. ఏపీ, నైజాంలో 11 కోట్ల షేర్, 19కోట్ల గ్రాస్‌ని వ‌సూలైంది. అమెరికా, క‌ర్నాట‌క‌, త‌దిత‌ర‌చోట్ల‌ వ‌సూళ్లు క‌లుపుకుని ఓవ‌రాల్‌గా 13కోట్ల షేర్‌, 20 కోట్ల గ్రాస్ ఈ సినిమా ద‌క్కించుకుంది. అయితే వ‌ర‌ల్డ్‌వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ 26 కోట్లు.. ఆ మొత్తం ఇక రిక‌వ‌రీ అయ్యే ఛాన్స్ లేనేలేదు. ఎలానూ నెక్ట్స్ వ‌చ్చేది పెద్ద పులి. ద‌ట్ మీన్స్ `భ‌ర‌త్ అనే నేను` హ‌వా కొన‌సాగనుంది కాబ‌ట్టి అంత‌వ‌ర‌కూ ఆడినా.. కానీ నాని సినిమాకి స‌గం షేర్ న‌ష్టాలు క‌నిపించేట్టే ఉంది స‌న్నివేశం. 26 కోట్ల షేర్ సాధించాల్సిన చోట‌, 13 కోట్ల‌తో స‌రిపుచ్చుకుందంటే హాఫ్ బాయిల్డ్ అనే అనాలి.

  •  
  •  
  •  
  •  

Comments