సాహో టీజర్ ! విజువల్స్ కావు..వీడియో గేమ్

Friday, June 14th, 2019, 02:06:33 PM IST

ఎన్నో అంచనాలు, మరెన్నో సంచలనలను మోసుకుంటూ నిన్న ప్రభాస్ నటించిన సాహో టీజర్ విడుదల అయ్యింది. ముందు నుండి ఈ సినిమా పూర్తిగా యాక్షన్ మూవీ గా ప్రమోట్ చేయటంతో, టీజర్ కూడా అలాగే కట్ చేసి ఒక విజువల్ వండర్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు కానీ, అది అనుకున్న రేంజులో సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈ టీజర్ పై మిశ్రమ స్పందన వస్తుంది. అది విజువల్ వండర్ కాదు..వీడియో గేమ్ అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ లో విచిత్రమైన రివ్యూలు ఇస్తూ, పాపులారిటీ సంపాదించుకున్న కే ఆర్ కే (కమల్ రషీద్ ఖాన్ ) సాహో గురించి సంచలనమైన ట్విట్ చేశాడు. సాహో టీజర్ ఒక వీడియో గేమ్ లా చాలా అద్భుతంగా ఉంది. 300 కోట్లు భారీ బడ్జెట్ తో వస్తున్నా ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ప్లాఫ్ అవుతుంది అంటూ పోస్ట్ చేశాడు. అతను చేసిన పోస్ట్ చూసి ప్రభాస్ ఫాన్స్ ఒక రేంజు లో ఫైర్ అవుతున్నారు..

గతంలో అట్టర్ ప్లాఫ్ సినిమాలకి సూపర్ అంటూ రివ్యూలు ఇచ్చిన నువ్వా, సాహో సినిమా గురించి మాట్లాడేది అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. నిజానికి “కే ఆర్ కే” లాంటి వాళ్ళు అన్నారని కాదు కానీ, టీజర్ పై మాత్రం యూనానిమస్ గా పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని తదుపరి ప్రమోషన్స్ విషయంలో సాహో టీం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.