పిక్ టాక్‌: లేడీ రోబో కిల్లింగ్ లుక్

Friday, October 12th, 2018, 11:23:19 PM IST

ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్ర‌మ్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎమీజాక్స‌న్‌. కోట్లాది మంది అభిమానులు నిరంత‌రం ఎమీజాక్స‌న్ ఫోటోషూట్ల కోసం సామాజిక మాధ్య‌మాల్లో వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఎమీ ఇచ్చే ట్రీట్ అల్టిమేట్. తాజాగా సూట్‌లో ప్ర‌త్యేకంగా ఫోజులిచ్చింది. ఈ లుక్‌ని డిజైన్ చేసిన వాళ్ల‌కు ఎమీ అద్భుతమైన కాంప్లిమెంట్లు ఇచ్చింది. నా ఫేవ‌రెట్ మేక‌ప్‌మేన్‌లు నిక్కి, పాట్రిక్ విల్స‌న్ సాయంతోనే ఇలా అందంగా ముస్తాబ‌య్యాను. ఇస‌బెల్లా లాంబార్డిని ఈ ఫోటోషూట్ చేశారు.. అని తెలిపింది.

ఎమీ జాక్స‌న్‌ న‌టించిన `2.o` న‌వంబ‌ర్ 29న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్, అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌రోవైపు ఎమీజాక్స‌న్ హాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. ప్ర‌ఖ్యాత డీసీ సంస్థ‌ సూప‌ర్ ఉమెన్ త‌ర‌హా సిరీస్‌లో ఎమీజాక్స‌న్‌కి అవ‌కాశం ఇవ్వ‌నుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది.

View this post on Instagram

The most beautiful time of year 🍂

A post shared by Amy Jackson (@iamamyjackson) on