ఎన్టీఆర్ బయోపిక్ అంటూ వర్మ మళ్ళీ గిల్లుతున్నాడు ?

Friday, October 12th, 2018, 09:01:47 PM IST

అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమాలు తెరకెక్కించేందుకు ఏకంగా ముగ్గురు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అందులో లక్ష్మిస్ ఎన్టీఆర్ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేసాడు. దాంతో పాటు మరో నిర్మాత కూడా ఎన్టీఆర్ పై సినిమా మొదలు పెట్టె ప్రయత్నం చేసారు . అందులో తాజాగా ఎన్టీఆర్ పేరుతొ బాలయ్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇన్నాళ్లు ఎన్టీఆర్ సినిమా అంటూ ప్రకటించిన వర్మ ఎందుకో సైలెంట్ గా ఉన్నాడు.

మళ్ళీ తాజాగా అయన రంగంలోకి దిగుతూ లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతొ బయోపిక్ ని దసరా రోజున మొదలుపెడతానని ట్విట్ చేస్తూ .. ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతి పెళ్లి ఫోటోను పోస్ట్ చేసాడు .. ఈ ఫొటోలో చంద్రబాబు కూడా ఉండడం విశేషం!! అయితే వర్మ కావాలనే ఈ సినిమా విషయంలో చంద్రబాబు ని గుళ్ళుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వర్మ ఎందుకు ఇంత హడావిడిగా దసరా రోజు ఈ సినిమా మొదలు పెడతా అంటూ ప్రకటించాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వర్మ కావాలనే టిడిపి శ్రేణులను గిల్లె ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.