హాట్ టాపిక్: ఆర్జీవీ చిత్రంలో ఎన్టీఆర్ సన్నివేశం కీలకం కానుందా?

Sunday, November 17th, 2019, 06:11:04 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల కి సిద్ధంగా వున్నది. అయితే టైటిల్ కార్డు నుండి సంచలన విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. పాటల విషయంలో, సన్నివేశాల చిత్రీకరణ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది.

అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకునే తీరుని సైతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో రామ్ గోపాల్ వర్మ చూపించనున్నారట. ముఖ్యమంత్రిగా కొత్త నాయకుడు జగన్ పాత్రధారి ముఖ్యమంత్రి అయ్యే దగ్గరి నుండి సినిమా మొదలవుతుందని అన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు తెరకెక్కిస్తూ. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇది రెండు కులాలకు మధ్య జరిగిన పోరులాగ ఉండటం తో ఈ చిత్ర టైటిల్ పై పోలీస్ కేసు నమోదయిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో సంచలనాలు చూడటానికి ప్రజలు సైతం ఈ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.