“సాహో” టీజర్ పై లేటెస్ట్ బజ్..ఇది నిజమేనా.?

Tuesday, June 4th, 2019, 06:00:26 PM IST

ప్రస్తుతం “సాహో” సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయాన్నీ ఆ చిత్ర బృందం చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ఇంకా రెండు నెలలు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానుల్లో ఆత్రుత మరింత ఎక్కువ అయ్యేపోతుంది.ఇప్పటికే ఈ కొద్ది కాలంలోనే రెండు అప్డేట్స్ ఇచ్చినా సమయం తక్కువ ఉంటుండడంతో డార్లింగ్ అభిమానులు ఇంకా అప్డేట్స్ కావాలని కోరుకుంటున్నారు.ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు ట్రైలర్ కోసమే వీరు ఇప్పుడు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

అయితే సాహో టీజర్ కు సంబంధించి మాత్రం ఒక తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా కోసం కట్ చేస్తున్న టీజర్ లోని చిన్న అంశం అయినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే 15 లక్షలు ఖర్చు పెడుతున్నారట.మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో కానీ ప్రభాస్ అభిమానుల మధ్య ఇప్పుడు వైరల్ గా మారింది.ఇదొక్కటే కాకుండా ఇప్పుడు అప్డేట్ కోసం సోషల్ మీడియాను కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు.శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఆగష్టు 15న విడుదల కానుంది.