లేటెస్ట్ బజ్ : అనుకున్న టైంకే “అలవైకుంఠపురములో” టీజర్..?

Wednesday, September 18th, 2019, 07:52:08 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం “అలవైకుంఠపురములో”. కేవలం ఈ ఒక్క టైటిల్ తోనే ఈ సినిమా చుట్టూ ఒక పాజిటివ్ నెస్ ను త్రివిక్రమ్ తయారు చేసుకున్నారు.అదే విధంగా అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతే కాకుండా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అమితమైన స్పందన వచ్చింది.ఎలాగో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ముందే ప్రకటించారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మాత్రం ఎప్పుడు విడుదల చేస్తారా అన్న టాక్ వచ్చినప్పుడు మాత్రం ఈ దసరాకే విడుదల కాబోతుందని ఆ మధ్యన బజ్ వినిపించింది.అయితే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మాత్రం ఇదే అక్టోబర్ 8 దసరా సందర్భంగా విడుదల చేసేందుకే సిద్ధంగా ఉన్నారని మరింత ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.మరి మొత్తానికి ఈ టీజర్ అదే రోజున వస్తుందో లేదో చూడాలి.