మహేష్ 27వ చిత్రంపై లేటెస్ట్ బజ్..!

Monday, February 17th, 2020, 04:11:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీనికి ముందు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందుకున్న మహేష్ ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు.ఇంతకు ముందు వంశీతో తీసిన మహర్షి ఎంత పెద్ద హిట్టయ్యిందో మనం చూసాము.కానీ ఇప్పుడు దానిని మించిన హిట్టును అనీల్ తో తీసిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అందుకున్నారు.ఇప్పుడు దానిని మించిన హిట్టును అందుకోవాలని మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

అయితే మహర్షి తర్వాత సరిలేరు చిత్రం స్టార్ట్ చెయ్యడానికి ఎక్కువ సమయం తీసుకోని మహేష్ ఇప్పుడు ఈ చిత్రానికి కాస్త ఎక్కువ విరామమే తీసుకున్నారు.ఇదిలా ఉండగా ఇప్పుడు చిత్రంపై ఒక లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.మహేష్ నటిస్తున్న ఈ 27వ చిత్రానికి సంబంధించిన మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ ను ఈ మార్చ్ 25 న ఉగాది సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.దాదాపు ఇదే తేదీ ఖరారు చేసుకున్నారని ఇంకా అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉందని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.