లేటెస్ట్ బజ్ : “సరిలేరు నీకెవ్వరు”లో ఓ సీన్ ఇలా ఉంటుందట!

Saturday, June 8th, 2019, 09:38:18 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వరుస విజయాలను అందుకున్న తర్వాత అదే పరంపరను కొనసాగించేందుకు హిట్ చిత్రాల దర్శకుడు అయినటువంటి అనీల్ రావిపూడితో “సరిలేరు నీకెవ్వరు” చిత్రాన్ని ఇటీవలే మొదలు పెట్టారు.అలాగే ఈ చిత్రాన్ని త్వరగానే పూర్తి చేసేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచుతామని కూడా క్లారిటీ ఇచ్చేసారు.అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలోని మహేష్ సరసన మొట్టమొదటి సారిగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఒక సీన్ ఎలా ఉండబోతుందో అన్నది తెలుస్తుంది.కాశ్మీర్ నుంచి ఆంధ్రాకి వచ్చే ట్రైన్ లో ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుందని అప్పటి నుంచి వీరి మధ్య లవ్ పుడుతుందని తెలుస్తుంది.ఈ లవ్ ట్రాక్ చాలా బాగుంటుందని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎలాగో మహేష్ ఆర్మీ మేజర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు తెలిసిందే.ఆ విధంగా చూసుకున్నట్టయితే మహేష్ ఆంధ్రాకి వచ్చినపుడు ఈ సీన్ ఉన్నా పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదు మరి ఈ సీన్ ఉందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగక తప్పదు.