నితిన్ పాన్ ఇండియన్ సినిమాను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.!

Saturday, June 20th, 2020, 12:46:58 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు మొట్ట మూడు సినిమాలు రానున్నాయి. వీటిలో ఒకటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఈ చిత్రంలో నితిన్ కెరీర్ లో ఎన్నడూ నటించని విధంగా మూడు కొత్త కోణాల్లో కనిపించనున్నారని. అలాగే ఇది పూర్తిగా ఒక కొత్త పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా ఇందులో పలువురు అగ్ర నటులు కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా దర్శకుడు ఈ సినిమా సబ్జెక్టు పై చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ చిత్రాన్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి కీర్తి హీరోయిన్ గా నటించనుంది.