లేటెస్ట్ బజ్ : రామ్ చరణ్ మరో వినూత్న ప్రాజెక్ట్.!

Saturday, May 30th, 2020, 01:53:16 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ తో తీసిన “రంగస్థలం” నుంచి కొత్త కథలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న దర్శకులకు రామ్ చరణ్ ఒక్కొక్కరిని లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. అలా రామ్ చరణ్ రేస్ లో ఇప్పుడు సురేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు వీరితో పాటు రేస్ లో మరో అదిరిపోయే దర్శకుడు ఉన్నట్టు తెలుస్తుంది. అతనే గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కానీ ఓకే అయ్యినట్టయితే రామ్ చరణ్ నుంచి మరో గుర్తుండిపోయే రోల్ మరియు సినిమా చూడడం ఖాయం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్నారని సమాచారం.