గాసిప్స్ : చిరు 152 పై ఈ బజ్ నిజమైతే ఇంకేమన్నా ఉందా.?

Monday, January 13th, 2020, 04:06:09 PM IST

ప్రస్తుతం తెలుగు సినీ వర్గాలు సంక్రాంతి సినిమాల మాయలో పడిపోయారు.ఇది ఇలా ఇంకొన్ని రోజులు కొనసాగడం ఖాయం అయితే ఈ చిత్రాల విషయాల్లో పడిపోయి మిగతా రాబోయే చిత్రాలను పక్కన పెట్టేసారు.కానీ ఈ గ్యాప్ లోనే పలు చిత్రాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చేసాయి.అలా ఇప్పుడు ఒక గాసిప్ బయటకు బయటకు వచ్చింది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివతో తన 152వ చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

అంతే కాకుండా ఈ చిత్రానికి మెగాస్టార్ ఎవర్ గ్రీన్ కాంబో మణిశర్మ సంగీతం అందిస్తున్నారని వచ్చిన వార్తలు అయితే మెగా ఫ్యాన్స్ ఎడారిలో బిస్లరీ వాటర్ బాటిల్ దొరికినట్టయ్యింది.దీనితో ఈ సినిమా మాత్రం మాములు రేంజ్ లో ఉండదని ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి గతంలో ఒక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి.కానీ అవి ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి.కొరటాల శివ రామ్ చరణ్ ఉండే సీన్లను కాస్త ఎక్కువ పెట్టడమే కాకుండా ఇప్పుడు అతనికి ఈ చిత్రంలో హీరోయిన్ ను వెతికే పనిలో కూడా ఉన్నారని “ఊహాగానాలు” వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇదే బజ్ కానీ నిజమైనట్టయితే మామూలుగా ఉండదని చెప్పాలి.