బాలయ్య వల్ల వెంకీ ప్రాజెక్ట్ ఆగిపోయింది!

Wednesday, April 4th, 2018, 11:52:14 PM IST

గత కొంత కాలంగా ఎన్ని సినిమాలు చేసినా అపజయాలను చూస్తోన్న వెంకీ గ్యాప్ తీసుకొని సినిమా చేసినా హిట్ కొట్టడం లేదు. చాలా వరకు అతని కెరీర్ కష్టకాలంలోనే ఉంది. గురు సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆ తరువాత వెంకీ ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కూడా ఒకే చేయలేదు. ఫైనల్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో చాలా కాలం తరువాత బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న తేజ చెప్పిన కథను ఒకే చేశాడు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ సడన్ గా ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి రావడంతో తేజ ఇక ఆ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు. బాలకృష్ణ కూడా అతన్ని వదిలేలా లేడని తెలుస్తోంది. దీంతో వెంకటేష్ తో స్టార్ట్ చేసిన ప్రాజెక్టును తేజ ఆపేసినట్లు టాక్. వచ్చే ఏడాది ఎలక్షన్స్ లోపు ఎన్టీఆర్ బయోపిక్ రెడీ అవ్వాలని బాలయ్య డిసైడ్ అవ్వడంతో తేజ కూడా బయోపిక్ తో బిజీ అయ్యాడు. ఇక వెంకటేష్ ఇప్పుడు మరొక దర్శకుడు చెప్పిన కథను తెరకెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం.