లేటెస్ట్ : అబ్బాయ్ తో కలిసి ‘రంగస్థలం’ చూసిన బాబాయ్

Tuesday, April 10th, 2018, 12:43:00 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, అక్కినేని సమంత హీరోయిన్ గా వినూత్న చిత్రాల దర్శకులుసుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుకుమార్‌ దర్శకత్వం ప్రతిభకు, రామ్‌చరణ్‌, సమంతల నటనకు ఇటు ప్రేక్షకుల నుంచి అటు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలురికార్డులను తిరగేస్తున్న ఈ చిత్రాన్ని, సోమవారం మెగాస్టార్ సోదరులు, రాంచరణ్ బాబాయి అయినా పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి వీక్షించారు.

కాగా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో వేసిన ఈ షోకు రామ్‌చరణ్‌ తోపాటు అనసూయ తదితరులు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ ను చూసి పవన్ చాలా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ ట్యాలెంట్ ను స్పెషల్ గా అబ్జర్వ్ చేశారట. మూవీలో పొలిటికల్ యాంగిల్ ఉన్నా, దాన్ని ఫ్యామిలీ కంటెండ్ కి మిక్స్ తెరకెక్కించిన తీరును పవన్ ప్రత్యేకంగా అభినందించారట.

ఇక చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో చెర్రీ ఒదిగిపోయిన తీరుకు, పవన్ తెగ మురిసిపోయారని వినికిడి. తన పాతిక సినిమాల కెరీర్ లో ఇలాంటి సినిమా రాలేదే అనే ఫీలింగ్ ను కూడా వ్యక్తం చేశాడని టాక్. ఏది ఏమైనప్పటికీ అబ్బాయి సినిమా బాబాయికి బాగా నచ్చిందని సమాచారం….

  •  
  •  
  •  
  •  

Comments