AA19 నుంచి లేటెస్ట్ అప్డేట్..!

Sunday, June 2nd, 2019, 12:00:55 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించి తాజా వార్త ఇప్పుడొకటి బయటకు వచ్చింది.ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ ఈ జూన్ 4 వ తేదీ నుంచి మొదలు కాబోతుంది అని మొత్తం ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా 30 రోజులు కొనసాగనుంది అని తెలుస్తుంది.

అలాగే ప్రతీ సినిమాకు ఎవరొక అగ్ర నటుడు లేదా నటిని ఎంచుకునే త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా సీనియర్ నటి టబును ఎంచుకున్నారు.ఈమె కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది..ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.