RRR లేటెస్ట్ అప్డేట్ : మరో కొద్దీ గంటల్లో టైటిల్ ప్రకటన…

Saturday, October 19th, 2019, 02:39:17 AM IST

బాహుబలి లాంటి పెద్ద సినిమాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అతిపెద్ద భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే అంచనాలకు ఎక్కడ తగ్గకుండా భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ప్రస్తుతానికి 40శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్నటువంటి ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే మరొక షెడ్యూల్ చేయడనికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే అసలు విషయానికొస్తే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఇదేనంటూ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ అవన్నీ కూడా అసత్య ప్రచారాలని దర్శక నిర్మాతలు కొట్టిపారేశారు. అయితే ఈమేరకు మరొక మూడు రోజుల్లో ఈ చిత్ర టైటిల్ ని ఆదివారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఎందుకంటే ఈనెల 22 న కొమురం భీం జయంతి కావడంతో, కొమురం భీం పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించనున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు.