దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం RRR. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా కలవనటువంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆసక్తికర అంశాన్ని కథగా తీసుకోని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతానికి 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.
కాగా తన సినిమాకు సంబందించిన ప్రతీ అంశాన్ని ఎంతో గోప్యంగా ఉంచే దర్శకుడు రాజమౌళి, ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను బుధవారం నాడు వెల్లడించనున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది కూడా రేపే ప్రకటించనున్నారు. దానికి తోడు ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎదురుకోబోయే విలన్లు కూడా ఎవరనేది రేపే ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన నటించే ఆ నటి ఎవరనే అంశంపై మరింత ఆసక్తి పెరిగింది.