బిగ్ ట్రీట్ : ప్రేమికులరోజు సందడి చేయనున్న వరల్డ్ ఫేమస్ లవర్

Wednesday, November 20th, 2019, 02:30:47 AM IST

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మిస్తున్నారు. కాగా ఈ క్రేజి ప్రాజెక్టులో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్ లు సందడి చేయనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో విజయ్ ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడని సమాచారం. దానికి తోడు ముగ్గురితో కూడా తన ప్రేమ విఫలం అవుతుందని తెలుస్తుంది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో విజయ్ విరహ వేదనతో కనిపించాడు మనందరిలో ఒక ఆసక్తిని రేకెత్తించారు.

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యాక యువత మొత్తం కూడా పిచేక్కించడం ఖాయమని అంటున్నారు చిత్ర బృందం. కాగా ఈ సినిమా వచ్చే నెలలోనే విడుదలవ్వసి ఉంది కానీ కొన్ని కారణాల వలన చిత్రబృందం ఆపేస్తుందని సమాచారం. ఇకపోతే ప్రేమికుల దినమైన ఫిబ్రవరి 14 న విడుదల చేయాలనీ బలంగా నిర్ణయించుకున్నారంట మన నిర్మాతలు. అసలే లవర్ బాయ్ ఇమేజ్ ని సాధించుకున్న విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 14 న ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో చూడాలి మరి…