లేటెస్ట్ బజ్ : మెగాస్టార్ కు మరో అదిరిపోయే ఆల్బమ్ ఇస్తున్న మణిశర్మ.!

Monday, July 13th, 2020, 06:50:02 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలలో సంగీతం కూడా ఒకటి.

సంగీత బ్రహ్మ మణిశర్మ మరియు మెగాస్టార్ కాంబో అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ బెంచ్ మార్క్ టాలీవుడ్ లో ఉంది. ఇక వీరి కాంబోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మ్యూజిక్ లవర్స్ కు వీరి కాంబో ఒక మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

అలాంటి కాంబో నుంచి ఎన్నో ఏళ్ల తర్వాత ఓ సినిమా వస్తుంది అంటే ఆ అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమా కోసం మణిశర్మ మొత్తం 5 బాణీలు అందిస్తున్నారని, ఒక ఎమోషనల్ సాంగ్ ఒక డ్యూయెట్, ఒకటి హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్ అలాగే మరొకటి స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది.

అది ఐటమ్ సాంగ్ కూడా కావచ్చని వినికిడి. అలాగే మరొకటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కానీ లేదా రామ్ చరణ్ స్టోరీలో ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మాత్రం మణిశర్మ ఎలాంటి సంగీతం అందిస్తున్నారా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో పరిస్థితులు బాగుంటే విడుదల అయ్యే అవకాశం ఉంది.