నితిన్ “భీష్మ”పై లేటెస్ట్ అప్డేట్!

Thursday, December 12th, 2019, 08:57:26 PM IST

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న టైర్ 2 హీరోల్లో నితిన్ మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎన్నో ప్లాప్ సినిమాలు వచ్చినా సరే తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ను నితిన్ ఏర్పరచుకున్నారు.అలా ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మికా మందన్నాతో చేస్తున్న చిత్రం “భీష్మ”. నితిన్ కెరీర్ లోనే ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి కానీ సరైన అప్డేట్స్ మాత్రం చిత్ర యూనిట్ నుంచి రావట్లేదు.

దీనితో నితిన్ ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.ఎలాగో చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఎప్పుడో చెప్పేసారు.దానిలో భాగంగానే నితిన్ ఇప్పుడు తన డబ్బింగ్ ను చాలా వరకు పూర్తి చేసేసినట్టుగా అంతర్గత సమాచారం.అలాగే ఇదే డబ్బింగ్ లో ట్రైలర్ కు సంబంధించిన షాట్స్ లో డబ్బింగ్ టాకీ పార్ట్ ను కూడా ఇందులోనే పూర్తి చేసి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.మొత్తానికి అయితే నితిన్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పెయ్యడం మొదలు పెట్టేసారు అన్న దాంట్లో ఎలాంటి డౌటు లేదు.