పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Saturday, June 20th, 2020, 06:06:46 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా వరుసగా ఒక మూడు ప్రాజెక్టులను కూడా పవన్ చేస్తున్నారు. వీటిలో టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడై దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం కూడా ఒకటి.

భారీ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఒక లాటెట్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కాస్త లేట్ గా షూటింగ్ మొదలు పెట్టినా వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో నిలిపే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం వేసవిలో రావడం ఖాయం అని చెప్పాలి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తన్నారు.