“అల వైకుంఠపురములో” – అదిరిపోయే యాక్షన్ సీన్స్…

Sunday, October 20th, 2019, 12:41:18 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో వస్తోన్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’… కాగా గతంలో వీరిద్దరి కలయికలో వచ్చినటువంటి రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో, ఈ తాజాగా చిత్రం మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి… దానికితోడు ఇదివరకు విడుదల చేసినటువంటి సామజవరాగమనా… పాట శ్రోతలందరిని కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో టాప్ వరుసలో కొనసాగుతుంది. ఇక అసలు విషయానికొస్తే… ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలుకూడా ఒక రేంజ్ లో ఉంటాయని తాజా సమాచారం.

దానికి తోడు అల్ల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ లో డబుల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఆలా ఇద్దరిగా కనిపించేది కేవలం 5 నిముషాలే అయినప్పటికీ కూడా ఆ సన్నివేశం మాత్రం చిత్రానికి హైలెట్ గా కనిపించనుందని సమాచారం. అందుకు సంబంధించి దసరా కి విడుదలైన పోస్టర్ ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే… పోరాట సన్నివేశాల్లో బన్నీ సోలో పెరఫార్మెన్స్ చేశారని, ఎలాంటి డూప్ లను వాడలేదని చెబుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.