RRR అప్డేట్ : టైటిల్ లీక్ – అన్నిభాషల్లోను ఇదేనా…?

Wednesday, March 25th, 2020, 10:30:28 AM IST

బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR… ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రావాల్సిన చిత్రాన్ని విజువల్స్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవుతున్న కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు… ఇక అసలు విషయం ఏంటంటే… ఈ చిత్ర టైటిల్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిన సంగతి మనకు తెలిసిందే. అయితే మరికొద్ది గంటల్లో ఈ చిత్రానికి సంబందించిన టైటిల్, మోషన్ పోస్టర్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం.

అయితే ఇంతలోనే ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ సామాజిక మాంద్యమాల్లో ఒక పోస్టు వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రానికి అన్ని భాషల్లో ఒకే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించుకున్నారట దర్శకుడు రాజమౌళి… ఈ చిత్రానికి “రైజ్.. రివోల్ట్.. రివెంజ్” అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం. ఈ టైటిల్ నిజమో కాదో తెలీదు కానీ, ప్రస్తుతానికి ఈ టైటిల్ అటు సామాజిక మాంద్యమాల్లో, ఇటు చిత్ర వర్గాల్లో స్వైర విహారం చేస్తుంది. కాగా ఈ చిత్రానికి టైటిల్ ఇదే ఉంచుతారా, లేక మరేదైనా మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది…