RRR అప్డేట్ : అడవిలో ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా…? – షాకవుతున్న అభిమానులు

Friday, February 14th, 2020, 04:24:51 PM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. కాగా బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత తెరకెక్కుతున్నటువంటి చిత్రం కావడంతో ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ఇద్దరు మాస్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ఈ చిత్రంలో రెండు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం కారణంగా అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. కాగా చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక వీరులు కొమురం భీం మరియు అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక కల్పిత కథతో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ చిత్రానికి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు బయటకొస్తూనే ఉన్నాయి. కాగా ఇటీవలే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సన్నివేశం లీకైన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ పులి మాత్రం నిజమైనది అని సమాచారం. అయితే ఈ చిత్రంలో కొమురం భీం పాత్రను వీరత్వంతో కూడినదిగా చూపించేందుకు దర్శకుడు రాజమౌళి ఈ తీసుకున్నారని సమాచారం. అయితే పులితో ఫైట్ చేసే ఈ 10 నిముషాల సన్నివేశానికి థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయమని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోతున్నారు.