RRR : మోషన్ పోస్టర్ విడుదల ఓకే కానీ – ఎప్పుడనేది చెప్పలేదుగా…?

Wednesday, March 25th, 2020, 02:00:23 AM IST

బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR… ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు దర్శక నిర్మాతలు… ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ప్రస్తుతానికి సామాజిక మాంద్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్ర టైటిల్ ని, మోషన్ పోస్టర్ ని ఉగాది పర్వదినాన మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కానీ ఏ టైం కి విడుదల చేస్తాననేది మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు రాజమౌళి. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బయపెడుతున్నటువంటి కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తున్న కారణంగా ఈ చిత్రానికి పని చేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని సమాచారం. కాగా దీంతో ఏ టైం కి విడుదలవనుందనేది సరిగ్గా సమాచారం లేదంట. కానీ ఇది చూసాక ప్రేక్షకులందరూ కూడా మంచి థ్రిల్ కి గురవుతారని తాజా సమాచారం. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.