లారెన్స్ ఆడిన డ్రామా అంతా పబ్లిసిటీ కోసమా..?

Thursday, June 6th, 2019, 01:07:35 AM IST

అనేక రంగాలలో సిద్ద హస్తుడు అయిన రాఘవ లారెన్స్ దర్శకునిగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే లారెన్స్ కెరీర్ లో అతనికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి “ముని” సిరీస్ అనే చెప్పాలి.అయితే ఈ సిరీస్ లోని వచ్చిన “కాంచన” సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఇదే సినిమాను బాలీవుడ్ లో “లక్ష్మి” అనే పేరుతో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా జరిగాయి.

కానీ కొన్ని అనూహ్యమైన పరిస్థితులు వల్ల లారెన్స్ ఆ చిత్ర దర్శకత్వం నుంచి తప్పుకున్నట్టు తెలిపి మళ్ళీ వచ్చారు.దీనితో అక్కడి విమర్శకులు సహా నెటిజన్స్ లారెన్స్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.లారెన్స్ ముందు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాని చెప్పడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు తిరిగిరావడం ఎందుకు అంటూ విమర్శిస్తున్నారు.ఇదంతా ఈ సినిమా కోసం అతని రెమ్యూనరేషన్ మరియు పుబ్లిసిటీ పెంచుకోడం కోసమే చేసినట్టు ఉందని అంటున్నారు.కొంతమంది అయితే లారెన్స్ చేసింది కరెక్ట్ కాదని అతనిపై ఉన్న గౌరవాన్ని అతనే కోల్పోయేలా చేసుకున్నాడని అంటున్నారు.