లీగల్ నోటీసులు – చిక్కుల్లో మెగాస్టార్..!

Friday, November 2nd, 2018, 01:14:58 PM IST

బాలీవుడ్ లెజెండరీ ఆక్టర్, మెగాస్టార్ అమితాబ్ కు లీగల్ నోటీసులు అందాయి, తాజాగా ఆయన నటించిన ఒక వాణిజ్య ప్రకటనే ఇందుకు కారణం అని తెలుస్తుంది. ఇటీవల ఆయన నటించిన ప్రకటనలో న్యాయవాది గెటప్ వేసారట. నిబంధనలకు విరుద్దంగా అనుమతి తీసుకోకుండా ఆ గెటప్ ధరించినందుకు గాను ఆయనకు, ఆ ప్రకటన ప్రసారం చేసినందుకు మీడియా సంస్థలకు ఢిల్లీకి చెందిన బార్ కౌన్సిల్ లీగల్ నోటీసులు జారీ చేసింది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ప్రకటన ప్రసారం చేసినట్టు కౌన్సిల్ తెలిపింది. ఆ ప్రకటన ప్రసారం వెంటనే నిలిపేయాలంటూ, వెంటనే బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా, ఢిల్లీకి చెందిన బార్ కౌన్సిల్ తో పాటుగా, అన్ని రాష్ట్రాలకు చెందిన బార్ కౌన్సిల్స్ కు వివరణ ఇవ్వాలని తెలిపింది. భవిష్యత్త్యులో ఇంకెప్పుడూ అనుమతి లేకుండా నయాయవాది గెటప్ లో నటించద్దు అంటూ బిగ్ బి ని కోరింది. లేకపోతే ఈ ప్రకటనలో నటించిన వారందరిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ తెలిపింది. మరి ఈ నోటీసులకు మెగాస్టార్ అమితాబ్ ఎలా స్పందిస్తాడో చూడాలి,

  •  
  •  
  •  
  •  

Comments