లెజెండరీ క్రికెటర్ బయోపిక్ రిలీజ్ అప్పుడే !

Saturday, December 26th, 2020, 12:00:16 AM IST

కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ వస్తోన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. రణ్ వీర్ సింగ్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ బయోపిక్ సినిమాని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని జనవరి 22న విడుదల చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి తరువాత రిలీజ్ చేస్తారని సమాచారం.

కాగా ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.