బెంగళూర్ లో “మహర్షి” రికార్డులు మాములుగా లేవుగా!

Friday, June 7th, 2019, 06:16:07 PM IST

“మహర్షి” సినిమాతో మహేష్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా వినూత్న రీతిలో వసూళ్లు రాబడుతూ ట్రేడ్ పండితులకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది.ఓవర్సీస్ మార్కెట్ విషయాన్ని పక్కన పెడితే మన దేశంలో మాత్రం ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.సినిమా నిడివి ఎక్కువ అయినా సరే నాలుగు వారాలు గడుస్తున్నా వసూళ్లు స్టడీగా వస్తుండడం అభిమానులకు కూడా ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది.అలాగే బెంగళూరులో మాత్రం ఈ సినిమాకు మనదేశంలోనే ఏ సినిమాకు రానంత రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

అక్కడ బెంగళూర్ సిటీ మీనాక్షి థియేటర్లో ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజిని నటించిన “పేట” చిత్రం 35 లక్షల నెట్ గ్రాస్ వసూలు చేయగా మహర్షి మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి అక్కడ పేట రికార్డును తుడిచేసే నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలవనుంది అని తెలుస్తుంది.ఇదొక్కటే కాకుండా బెంగళూరు సిటీ సహా అక్కడ మొత్తం లాంగ్ రన్ లో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక భారతీయ సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అలాగే చివరగా మే నెలలో కూడా అక్కడ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా అవ్వని బుకింగ్స్ కూడా బుక్ మై షో ద్వారా అయ్యాయని ఇది కూడా ఓ రికార్డే అని అంటున్నారు.