బిగ్ డిసప్పాయింట్: ఆ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన మహేశ్..!

Friday, October 18th, 2019, 11:24:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సంపాదించిన సినిమా మహర్షి. మొదట్లో కలెక్షన్ల పరంగా కాస్త నెమ్మదించినా ఆ తరువాత ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ లో కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా జెమిని వారు ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ తీసుకుని బుల్లితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న కారణంగా బుల్లితెరపై 15 నుండీ 20 వరకూ టీఆర్పీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా జెమిని వారికి మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మహర్షి చిత్రం అర్బన్ మరియు రూరల్ కలిపి యావరేజ్ గా 8.4 టీఆర్పీ మాత్రమే వచ్చింది. జెమిని టీవీ భారీగా ప్రమోట్ చేసి మరీ ఎక్కువగా పోటీ లేని సమయంలో ప్రసారం చేసినా ఫలితం లేకుండా పోయింది. మహర్షి విషయంలో అంచనాలకి మించి వస్తుంది అనుకుంటే 8.4 రేటింగ్ మాత్రమే రావడంతో అటు జెమినీ వారే కాదు, మహేష్ ఫాన్స్ కూడా నిరాశకి గురయ్యారు.