బ్రేకీవెన్ అవ్వకుండానే ముగిసిన “మహర్షి” జర్నీ!

Thursday, June 6th, 2019, 06:50:57 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహర్షి”. ఈ చిత్రం గత మే నెల 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.అయితే మొదట్లో డివైడ్ టాక్ తోనే ఈ సినిమా ఆరంభం కొనసాగినా మెల్లమెల్లగా వసూళ్లు మాత్రం చాలా స్టడీగా కొనసాగాయి.అరకొరగా కొన్ని కొన్ని చోట్ల తప్ప సినిమా విడుదలైన 20 రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్స్ చాలా చోట్ల పడ్డాయి.అలాగే మహేష్ ఓవరాల్ గా 100 కోట్ల షేర్ ను రాబట్టేసాడు.

కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం బ్రేకీవెన్ అవ్వకుండానే మహర్షి తన జర్నీ ముగించినట్టు తెలుస్తుంది.అందులోను మహేష్ కు అత్యంత స్ట్రాంగెస్ట్ బేస్ గా పిలవబడే ఓవర్సీస్ మార్కెట్ లోనే ఈ చిత్రం దాదాపు రెండు కోట్ల నష్టాలను చూడక తప్పలేదు అట.ఓవర్సీస్ మార్కెట్ అంటేనే మహేష్ కు అడ్డాగా అభిమానులు భావిస్తారు.కానీ అలాంటిది అక్కడే ఈ సినిమా నష్టాలు చూడాల్సి వచ్చింది.అక్కడ మొత్తం 11.5 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా అక్కడ మొత్తం 9.5 కోట్లను మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అంటే దాదాపు 2 కోట్ల మేర నష్టాల్లోనే ఈ చిత్రం నిలిచిందని తెలుస్తుంది.మొత్తానికి మంచి సబ్జెక్టుతో వచ్చినా సరే మహేష్ కు స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న చోట కూడా నష్టాలు చూడక తప్పలేదు.