మ‌హేష్, రానా బిగ్‌ డీల్స్ వెన‌క‌..!?

Wednesday, October 17th, 2018, 02:52:01 PM IST

మీటూ ఉద్య‌మంలో బ‌డా చేప‌లే చిక్కుతున్నాయి. దీంతో ప‌రిశ్ర‌మ క‌దిలిపోతోంది. ఇండ‌స్ట్రీ టాప్ నేమ్స్ ఒక‌టొక‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. లేటెస్టుగా బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్ల‌తో భారీ కాంట్రాక్ట్స్‌, కార్పొరెట్ ప్ర‌క‌ట‌న‌ల డీల్స్ సెట్ చేసే ఓ పెద్దాయ‌న వేధింపుల వ్య‌వ‌హారంలో చిక్క‌డంతో బోలెడంత ర‌చ్చ‌వుతోంది. బిగ్ హ్యాండ్ అనిర్‌భాన్ బ్లా పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే త‌న పేరు బ‌య‌ట‌కు రావ‌డంపై ఆయ‌న కాస్తంత గుర్రుగానే ఉన్నార‌ని తెలుస్తోంది.

శ్ర‌ద్ధా క‌పూర్, సోన‌మ్ క‌పూర్ స‌హా టాలీవుడ్ స్టార్ల‌లో మ‌హేష్, రానాల‌కు బ్రాండ్ల విష‌యంలో కాంట్రాక్టులు సెట్ చేసేది అనిర్‌భాను బ్లా. వంద‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్ర‌క‌ట‌న‌ల రూపంలో కోట్లాది రూపాయ‌లు మ‌న స్టార్లు ఆర్జిస్తున్నారంటే ఆయ‌న నైపుణ్యం.. కాంటాక్ట్స్ వ‌ల్ల‌నే. అందుకే ప్ర‌స్తుతం ఆ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆ మేర‌కు ఓ జాతీయ మీడియాలోనూ ప్ర‌త్యేక క‌థ‌నాలు హైలైట్ అయ్యాయి. ప్ర‌ముఖ యాడ్ ఏజెన్సీలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ట్యాలెంట్ మేనేజ్‌మెంట్ ప్ర‌తిదీ అనిర్ బ్లా చూస్తుంటారు. మీటూ వేదింపుల్లో ఆయ‌న బ‌య‌ట‌ప‌డ‌డంతో కంపెనీ నుంచి ఒంట‌రివాడ‌య్యాడ‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments